ETV Bharat / sports

సచిన్​కు సలహా ఇచ్చిన వ్యక్తితో 'ఈటీవీ భారత్' ముఖాముఖి​

ఎల్బోగార్డు మార్చుకోవాలని సచిన్​కు సలహా ఇచ్చిన వెయిటర్ గురుప్రసాద్ సుబ్రమణ్యన్​తో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది ఈటీవీ భారత్. 19 ఏళ్ల క్రితం చెప్పిన విషయాన్ని గుర్తుంచుకుని తనను కలవాలనుందని చెప్పడం.. మాస్టర్ బ్లాస్టర్​ గొప్పతనానికి నిదర్శనమన్నారు సుబ్రమణ్యన్​.

Exclusive interview of Guruprasad: The waiter who helped Sachin improve his batting
'19 ఏళ్లయిన మర్చిపోని సచిన్​ చాలా గొప్పవాడు'
author img

By

Published : Dec 16, 2019, 9:43 AM IST

సచిన్​ తెందూల్కర్ సలహా కోసం స్టార్ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటిది ఎల్బోగార్డ్ విషయంలో తనకు ఓ వ్యక్తి సలహా ఇచ్చాడని, ఆ సూచన తనకు ఎంతో ఉపయోగపడిందని ఇటీవల ట్వీట్ చేశాడు మాస్టర్. సచిన్​కు సలహా ఇచ్చిన ఆ వ్యక్తి ఎక్కడున్నారో గుర్తించి... ప్రత్యేఖ ముఖాముఖి నిర్వహించింది ఈటీవీ భారత్​.

చెన్నైలోని తాజ్ కోరమండల్​ హోటెల్లో​ వెయిటర్​గా​ పనిచేశారు గురుప్రసాద్ సుబ్రహ్మణ్యన్​. 19 ఏళ్ల క్రితం ఎల్బోగార్డ్ విషయంలో సచిన్​కు తానే సలహా ఇచ్చానని చెప్పారు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుపెట్టుకోవడం మాస్టర్ గొప్పతనానికి నిదర్శనమని పొంగిపోయారు.

'19 ఏళ్లయిన మర్చిపోని సచిన్​ చాలా గొప్పవాడు'

"మొదట సచిన్​ తెందూల్కర్​కు ధన్యవాదాలు చెప్పాలి. 19 ఏళ్ల తర్వాత కూడా నేను చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవడమే కాకుండా మళ్లీ ప్రస్తావించడం సాధారణమైన అంశం కాదు" -గురుప్రసాద్ సుబ్రహ్మణ్యన్​

"నేను చెప్పిన సలహా గుర్తుంచుకునేంత పెద్దదేం కాదు. కానీ ఆ సంఘటనను మర్చిపోకుండా నన్ను కలవాలనుందని చెప్పిన సచిన్ ఔదార్యానికి ఆశ్చర్యమేసింది. ప్రపంచం ఇప్పటివరకు చూడని గొప్ప క్రికెటర్ మాస్టర్." -గురుప్రసాద్ సుబ్రహ్మణ్యన్​

ఎల్బోగార్డు విషయంలో సలహా..

ఓ టెస్టు మ్యాచ్​ కోసం చెన్నై వెళ్లిన సచిన్​.. అక్కడ తాజ్​ కోరమండల్​ హోటల్​లో బస చేశాడు. ఆ సమయంలో సచిన్ కాఫీ ఆర్డర్​ ఇవ్వగా​... ఓ వెయిటర్ దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. కాఫీ ఇచ్చిన అనంతరం మాస్టర్​తో కాసేపు మాట్లాడాలని అడిగాడట ఆ వెయిటర్​. అందుకు ఒప్పుకున్న సచిన్​​.. విషయం చెప్పమని అడిగాడు. ఎల్బోగార్డ్​ ఉపయోగించినప్పుడు బ్యాట్​ స్వింగ్​ మారుతుందని సచిన్​కు చెప్పాడట ఆ వెయిటర్​. తర్వాత ఆ విషయాన్ని గమనించిన సచిన్​కు వెయిటర్ మాటలు నిజమని అర్థమైందట. ప్రపంచంలో తన తప్పును చెప్పిన ఏకైక వ్యక్తి ఆ వెయిటర్​ అని కితాబిచ్చాడు మాస్టర్. అతని సలహా పాటించి తన ఎల్బో ప్యాడ్​ను మార్పు చేసుకున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం ఆ వెయిటర్​ ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని. నెటిజన్లు దయచేసి అతని గురించి వివరాలు తెలిస్తే చెప్పాలని ట్విట్టర్​ వేదికగా కోరాడు. ఇంగ్లీష్​తో పాటు తమిళంలోనూ తెందూల్కర్​ ట్వీట్​ చేయడం విశేషం.

  • A chance encounter can be memorable!
    I had met a staffer at Taj Coromandel, Chennai during a Test series with whom I had a discussion about my elbow guard, after which I redesigned it.
    I wonder where he is now & wish to catch up with him.

    Hey netizens, can you help me find him? pic.twitter.com/BhRanrN5cm

    — Sachin Tendulkar (@sachin_rt) December 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Exclusive interview of Guruprasad: The waiter who helped Sachin improve his batting
సచిన్ తమిళ ట్వీట్​

ఇదీ చదవండి: సచిన్​కు సలహా ఇచ్చిన ఆ వెయిటర్​ ఎవరు..?

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Monday, 16 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2307: Spain Santa Ride AP Clients Only 4244909
Thousands of Santas join motorbike parade in Spain
AP-APTN-2158: Germany Wahlburger AP Clients Only 4244907
Mark Wahlburg arrives in Germany to open Walburgers at military base
AP-APTN-2025: Israel Christmas Tree AP Clients Only 4244902
Hundreds watch switching on of Jaffa Christmas tree
AP-APTN-2007: US Box Office Content has significant restrictions, see script for details 4244900
'Jumanji' ends 'Frozen 2' hot streak to claim top spot
AP-APTN-1647: Philippines Christmas House AP Clients Only 4244889
House decked with Xmas lights delights Filipinos
AP-APTN-1441: Kosovo Santa Marathon AP Clients Only 4244874
Santas take part in Kosovo charity run
AP-APTN-0924: Brazil Christmas Tree AP Clients Only 4244840
Giant Christmas tree lit up in Rio lake
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.