బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దీపక్ చాహర్. ఫలితంగా ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. 88 స్థానాలు మెరుగుపర్చుకుని 42వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ టాప్‌లో, కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్ రెండో స్థానంలో ఉన్నారు.
బ్యాట్స్‌మెన్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి చేరాడు.
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పాక్‌కు చెందిన బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ క్రికెటర్ ఫించ్ రెండో ర్యాంకులో, డేవిడ్ మలాన్(ఇంగ్లాండ్) మూడో స్థానంలో ఉన్నారు.
జట్లు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ తొలిస్థానం.. ఓ పాయింట్ తేడాతో ఆస్ట్రేలియా రెండులో ఉంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వరుసగా మూడు, నాలుగు ర్యాంకుల్లో ఉన్నాయి. భారత్ ఐదులో కొనసాగుతోంది.
ఇదీచదవండి: సీనియర్ల వల్లే ఓడిపోయాం: మహ్మదుల్లా