ETV Bharat / sports

తండ్రి కంటే ఏదీ ఎక్కువ కాదు: బెన్ స్టోక్స్​ - గెడ్ స్టోక్స్

తన తండ్రి ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదంటున్నాడు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్. నాన్న కోసం తన విజయాలను సైతం వదులుకుంటానని చెబుతున్నాడు.

Ben Stokes Happy To Swap 2019 Success For Father's Good Health
తండ్రి కంటే ఏది ఎక్కువ కాదు: బెన్ స్టోక్స్​
author img

By

Published : Jan 1, 2020, 1:45 PM IST

Updated : Jan 1, 2020, 2:50 PM IST

ఓ స్థాయికొచ్చిన తర్వాత కొంతమంది కన్నవారినే పట్టించుకోరు. అలాంటిది ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రం తనకు తండ్రే ముఖ్యమంటున్నాడు. ఆయన కోసం తన విజయాలను దూరం చేసినా.. ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నాడు. ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బెన్ స్టోక్స్ తండ్రి గెడ్​.. నెమ్మదిగా కోలుకుంటున్నారు.

"ఈ ఏడాది ఎన్నో నమ్మలేని విజయాలు వచ్చాయి.. కొన్ని అపజయాలూ ఎదురయ్యాయి. కానీ మా నాన్న ఆసుపత్రిలో ఉండటం చూస్తుంటే.. అవన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఎవరైన నా దగ్గరకొచ్చి 'నీకు దక్కిన విజయాలన్నీ దూరం చేస్తా.. మీ తండ్రిని మాత్రం ఆరోగ్యంగా.. ఆనందంగా ఉంచి.. నీ ఆట చూసే అవకాశం కల్పిస్తా' అంటే నా సక్సెస్​ను దూరం చేసుకోవడానికి తప్పకుండా అంగీకరిస్తా"

-బెన్ స్టోక్స్​, ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​

ఇప్పుడిప్పుడే తన తండ్రి కోలుకుంటున్నాడని స్టోక్స్ చెప్పాడు.

"ప్రస్తుతం మా నాన్న ఆరోగ్యం స్థిమితపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయనను జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు" - బెన్ స్టోక్స్​, ఇంగ్లాండ్ ఆల్​రౌండర్.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 107 పరుగుల తేడాతో ఓడి 4 టెస్టుల సిరీస్​లో 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. కేప్​టౌన్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు జరగనుంది. నాలుగేళ్ల క్రితం ఈ మైదానంలోనే స్టోక్స్(258) తన కెరీర్​ అత్యుత్తమ స్కోరు సాధించాడు.

సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్​ సందర్భంగా ఆరుగురు సహాయసిబ్బంది సహా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. జట్టు సభ్యులు ఇలా అనారోగ్యం బారిన పడటాన్ని స్టోక్స్.. కర్స్​డ్​​ టూర్​గా(చెడ్డ పర్యటన) పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: హార్దిక్ ప్రేమలో పడ్డాడు.. ఇన్ స్టా వేదికగా ప్రకటన

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jan 1, 2020, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.