ETV Bharat / sports

నిప్పులు చెరిగిన ఇషాంత్.. బంగ్లా 106 ఆలౌట్​ - pink test

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్​తో జరుగుతోన్న పింక్ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్ 106 పరుగులకే కుప్పకూలింది. ఇషాంత్ శర్మ 5 వికెట్లతో అదరగొట్టాడు.

నిప్పులు చెలరేగిన ఇషాంత్.. బంగ్లా 106 ఆలౌట్​
author img

By

Published : Nov 22, 2019, 4:47 PM IST

Updated : Nov 22, 2019, 5:03 PM IST

చారిత్రక పింక్ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్ బోల్తా పడింది. టీమిండియా బౌలర్ల ధాటికి 106 పరుగులకే కుప్పకూలింది. కేవలం 30.2 ఓవర్లే ఆడిన బంగ్లాలో... ఇస్లామ్​(29)దే అత్యధిక స్కోరు. ఇషాంత్ శర్మ 5 వికెట్లతో నిప్పులు చెరిగాడు. ఉమేశ్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేయస్​ను(4) ఔట్ చేసి పింక్ బంతితో తొలి వికెట్ తీసిన భారత బౌలర్​గా ఇషాంత్ రికార్డు సృష్టించాడు. అనంతరం ఉమేశ్ యదవ్ ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో మోమినుల్ హక్(0), మహ్మద్ మిథున్​(0) పెవిలియన్ చేర్చి బంగ్లా పులులను కోలుకోలేని దెబ్బతీశాడు.

నలుగురు డకౌట్​..

బంగ్లా కెప్టెన్‌ మొమినుల్‌ హక్‌(0), మహ్మద్‌ మిథున్‌(0), ముష్ఫికర్‌ రహీమ్‌(0), అబూ జాయేద్​(0) నలుగురూ డకౌటవ్వడం విశేషం. లంచ్ విరామానికే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది బంగ్లాదేశ్. మొమినుల్​, మహ్మద్ మిథున్​ను ఉమేశ్​ డకౌట్ చేయగా.. ముష్పీకర్, అబు జాయేద్​ను షమీ పెవిలియన్ చేర్చాడు.

లంచ్ తర్వాత..

లంచ్ తర్వాత ఇషాంత్ అదరగొట్టాడు. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బంగ్లాను ఓ ఆటాడుకున్నాడు ఇషాంత్. టెయిలెండర్ల పనిబట్టాడు ఇషాంత్. కేయస్, మహ్మదుల్లా, నయీమ్ హసన్, ఎబాదత్ హొస్సేన్, మెహదీ హసన్​లను అవుట్​ చేసి మొత్తం 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు ఇషాంత్.

అనంతరం టీమిండియా బ్యాటింగ్​కు దిగింది. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతున్నారు.

ఇదీ చదవండి: పింక్ టెస్టు: రెప్పపాటులో.. కళ్లు చెదిరే క్యాచ్​లు

Mumbai, Nov 22 (ANI): Bollywood actor Bhumi Pednekar was spotted in Mumbai. She kept her look casual yet stylish. Actor Ananya Panday was also seen in Mumbai. She looked charming in white shorts and crop top. Both the actors will be seen in upcoming movie 'Pati Patni Aur Woh'.
Last Updated : Nov 22, 2019, 5:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.