ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ బౌలర్ యాసిర్ షా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ రెండు టెస్టుల్లో కలిపి కేవలం నాలుగు వికెట్లు తీసి 402 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఆసీస్‌పై గత 5 టెస్టుల్లో అతడి బౌలింగ్ సగటు 89.5 ఉండడం గమనార్హం.
గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో 4 వికెట్లు తీసి 205 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో 32 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయకుండానే.. 197 పరుగులు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు సమర్పించాడు. ఇందులో ఒకే ఒక్క ఓవర్ మేయిడెన్.
12 వికెట్లు 1074 పరుగులు..
ఆస్ట్రేలియాపై యాసిర్ షా బౌలర్ ప్రదర్శన అత్యంత ఘోరంగా ఉంది. ఆసిస్ సొంతగడ్డపై అతడు ఆడిన ఐదు టెస్టుల్లో 12 వికెట్లు తీసి 1074 పరుగులు ఇచ్చాడు. 2016-17 సీజన్లో ఒక్క ఇన్నింగ్స్‌లోనే 207 పరుగులు సమర్పించి చెత్త రికార్డు నెలకొల్పాడు.
రెండో టెస్టులో ఈ లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లోనే 111 పరుగులు పిండుకున్నాడు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ట్రిపుల్ సెంచరీతో కెరీర్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించాడు.
![4 wickets for 400 runs: Yasir Shah's nightmares in Australia continue with pink ball as Warner rules with 335*](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5227070_ewa.jpg)
కష్టాల్లో పాక్..
ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా 589/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియా. వార్నర్(335*) ట్రిపుల్ శతకంతో చెలరేగగా.. లబుషేన్(162) శతకంతో అదరగొట్టాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ(3/88) మినహా.. మిగతా వారు విఫలమయ్యారు.
అనంతరం బరిలో దిగిన పాకిస్థాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 96 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. మిషెల్ స్టార్క్(4/22) పాక్ బ్యాట్స్‌మెన్ పతనాన్ని శాసించాడు. కమిన్స్, హేజిల్‌వుడ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
![4 wickets for 400 runs: Yasir Shah's nightmares in Australia continue with pink ball as Warner rules with 335*](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5227070_yd.jpg)
ఇదీ చదవండి: వార్నర్ దూకుడు అడ్డుకున్న పైన్.. నెటిజన్ల ఫైర్