భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ దీపావళి రోజున 'భారత్ కీ లక్ష్మీ' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి ప్రచారకర్తలుగా ప్రముఖ షట్లర్ పీవీ సింధు, బాలీవుడ్ నటి దీపికా పదుకొణెలను నియమించింది ప్రభుత్వం. వీరిద్దరిని భాగస్వామ్యం చేస్తూ ఓ వీడియోనూ రూపొందించింది. మహిళలు సాధించిన విజయాలు, ప్రగతికి మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు.
'భారత్ కీ లక్ష్మీ' హ్యాష్‌ట్యాగ్‌తో ఆడవాళ్లు సాధించిన అద్భుత విజయాలను షేర్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. మహిళా శక్తిని గౌరవించి పండుగను మరింత శోభాయమానంగా చేసుకోవాలని.. 57వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఉద్ఘాటించారు.
మహిళా సాధికారత వల్ల సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు పీవీ సింధు, దీపికా. దీపావళి సందర్భంగా చేపట్టనున్న భారత్ కీ లక్ష్మీ కార్యక్రమానికి వీరిద్దరూ మద్దతు తెలిపారు.
-
Societies grow when women are empowered and their accomplishments are given a place of pride!
— Pvsindhu (@Pvsindhu1) October 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
I support PM @narendramodi ji #BharatKiLaxmi movement. It celebrates extraordinary achievements of extraordinary women of India.
This Diwali, let’s celebrate womanhood. pic.twitter.com/SQ9vmifq6u
">Societies grow when women are empowered and their accomplishments are given a place of pride!
— Pvsindhu (@Pvsindhu1) October 21, 2019
I support PM @narendramodi ji #BharatKiLaxmi movement. It celebrates extraordinary achievements of extraordinary women of India.
This Diwali, let’s celebrate womanhood. pic.twitter.com/SQ9vmifq6uSocieties grow when women are empowered and their accomplishments are given a place of pride!
— Pvsindhu (@Pvsindhu1) October 21, 2019
I support PM @narendramodi ji #BharatKiLaxmi movement. It celebrates extraordinary achievements of extraordinary women of India.
This Diwali, let’s celebrate womanhood. pic.twitter.com/SQ9vmifq6u
"మహిళలు ప్రగతి పథంలో పయనిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది. వాళ్ల నిర్ణయాలకు మనం సరైన స్థానం కల్పించాలి. మోదీ చేపడుతోన్న భారత్ కీ లక్ష్మీ ప్రచారానికి నేను మద్దతిస్తున్నాను. దేశంలో మహిళలు సాధించిన అద్భుత విజయాల వేడుకలను ప్రత్యేకంగా జరుపుకొందాం. ఈ దీపావళిని మహిళాశక్తితో నింపేద్దాం"
- సింధు ట్వీట్
ఈ ఏడాది ఆగస్టు 25న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది సింధు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది.
15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ అనే మహిళ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న'ఛపాక్' సినిమాలో నటించింది దీపికా. విక్రాంత్ మస్సే ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నాడు .'రాజీ’ ఫేం మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకురాలు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా.. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.