'అల వైకుంఠపురములో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ చక్కటి సర్‌ప్రైజ్‌ను అందించాడు. తాజాగా దీనికి సంబంధించి బన్నీ రౌడీ హీరోకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఆ కానుకను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇంతకీ స్టైలిష్ స్టార్‌కు ఈ యువ హీరో పంపిన కానుక మరేదో కాదు.. దేవరకొండ రౌడీ బ్రాండింగ్ దుస్తులు. 'అల వైకుంఠపురములో' చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రేమతో బన్నీకి ఈ కానుక పంపినట్లు ఆ దుస్తులపై పెట్టిన గ్రీటింగ్ బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పాడు.
"మాటిచ్చినట్లుగానే దుస్తులు పంపావు. నేను ఈ బట్టలతో 'వైకుంఠపురములో' వేడుకల్లో కనిపిస్తా" అని రౌడీ హీరోకి మాటిచ్చాడు అర్జున్. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమా అయినందున ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
THANK YOU VERY
— Allu Arjun (@alluarjun) January 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
MUCH MY DEAR BROTHER VIJAY @TheDeverakonda . VERY SWEET GESTURE. AS PROMISED U SENT ME CLOTHES . YOU WILL BE SEEING ME WITH IT DURING #AVPL CELEBRATIONS #ROWDY #Manofwords pic.twitter.com/lY7BWGDzuE
">THANK YOU VERY
— Allu Arjun (@alluarjun) January 11, 2020
MUCH MY DEAR BROTHER VIJAY @TheDeverakonda . VERY SWEET GESTURE. AS PROMISED U SENT ME CLOTHES . YOU WILL BE SEEING ME WITH IT DURING #AVPL CELEBRATIONS #ROWDY #Manofwords pic.twitter.com/lY7BWGDzuETHANK YOU VERY
— Allu Arjun (@alluarjun) January 11, 2020
MUCH MY DEAR BROTHER VIJAY @TheDeverakonda . VERY SWEET GESTURE. AS PROMISED U SENT ME CLOTHES . YOU WILL BE SEEING ME WITH IT DURING #AVPL CELEBRATIONS #ROWDY #Manofwords pic.twitter.com/lY7BWGDzuE
ఇవీ చూడండి.. బర్త్‌డే గిఫ్ట్ అదిరింది.. 'ఏఏ20' టీజర్ ఇదిగో..!