ఈ దశాబ్ద కాలంలో వచ్చిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి'.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ వంగా... ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రూపొందించాడు. అక్కడ దాదాపు రూ.300 కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు 'ఆదిత్య వర్మ' వంతు వచ్చేసింది. విక్రమ్ తనయుడు ధ్రువ్ తొలిసారి హీరోగా నటించాడీ సినిమాలో. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' లాగా 'ఆదిత్య వర్మ'.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఇటీవలే విడుదలైన ఈ చిత్రం.. తమిళనాట కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాకు వస్తున్న స్పందనపై సంతోషం వ్యక్తం చేస్తూ దర్శకనిర్మాతలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. కథానాయకుడు విక్రమ్ తన తనయుడికి తొలి సినిమాతోనే విజయం దక్కటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
"తండ్రిగా దీనికి మించిన ఆనందం మరొకటి లేదు. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్‌కు మనసారా కృతజ్ఞతలు".
-విక్రమ్, సినీ నటుడు
ఈ సినిమా కోసం ఎంతగానే శ్రమించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు కథానాయకుడు ధ్రువ్.
"ఈ విజయాన్ని నాది అని చెప్పలేను. ఎందుకంటే ప్రతి విషయంలోనూ నాన్న వెనుక నుంచి సహకారం అందించారు. నాకు జుట్టు, మీసం కాస్త చెరిగిపోయినా...ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి సరి చేసేవారు. 22 ఏళ్ల వయసులో నాన్నకు ఇలాంటి ఓ వేదిక, అవకాశం లభించి ఉంటే నా కన్నా అద్భుతంగా చేసేవారు. కానీ నాకు ఆ అదృష్టం దక్కింది. నాన్న లేకుంటే ఇదంతా కలలో కూడా ఊహించలేను.. ఆయనే సర్వస్వం...నాన్న నీ రుణం తీర్చుకోలేను..నీ గురించి ఎంత చెప్పినా తక్కువే" అని పేర్కొన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. దీపిక ద్రౌపదిగా 'మహాభారతం'...