జీవితంలో ఒంటరి తనంతో స్నేహం చేసి, తనదైన స్వప్న ప్రపంచాన్ని అందగా ఆవిష్కరించుకొని, ఆ ఊహా ప్రపంచాన్నే యావత్ లోకానికి సినిమా రూపంలో బహుకరించాడు. ఆతడే ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్. ఆయన సృజనలో పురుడు పోసుకున్న అద్భుత చిత్రాలు ఎన్నో ఉన్నాయి. 'జాస్', 'క్లోజ్ ఎన్కౌంటర్', 'జురాసిక్ పార్క్' చిత్రాలు స్పీల్ బెర్గ్ సృష్టిలో భాగం. నేడు స్పీల్ బర్గ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ఇదీ వ్యక్తిగత జీవితం.
స్పీల్‌బెర్గ్ పూర్వికులు 1905లో రష్యా నుంచి అమెరికాకు తరలివెళ్లారు. తండ్రి ఆర్నాల్డ్ స్పెల్ బెర్గ్ కంప్యూటర్ ఇంజనీర్. తల్లి లీ ఆర్నాల్డ్ పియానో కళాకారిణి. ఉద్యోగరీత్యా తండ్రి అనేకానేక ప్రాంతాల్లో నివసించడం కారణంగా స్పీల్‌బెర్గ్ తరచూ ఊళ్ళు మారేవాడు. ఇంట్లో తల్లితండ్రుల మధ్య సఖ్యత లేకపోడం వల్ల చిన్నతనంలోనే స్పీల్ ఒంటరితనంతో జీవించాడు.. కొద్దిరోజుల తర్వాత ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ ఘటన స్పీల్‌బెర్గ్‌ని తీవ్రంగా కలచి వేసింది. ఇంగ్లీష్‌లో తనకు నచ్చని ఒకే ఒక పదం 'డివోర్స్' అని స్పీల్‌బెర్గ్ తరచూ చెప్తుంటాడు.
సినీ ప్రస్థానం ఇలా
స్పీల్‌బెర్గ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్. స్కూలుకెళ్లడం అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. హై స్కూల్ స్థాయిలో ఫిజిక్స్ సబ్జెక్టులో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు. తన పందొమ్మిదేళ్ళ వయసులో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఆంగ్లం అభ్యసించాడు. ఆ సమయంలోనే సమీపంలో ఉన్న యూనివర్సల్ స్టూడియోలో రెండు రోజులు గడపాల్సి వచ్చింది. అక్కడే సినిమా ప్రేమలో పడ్డాడు. స్టూడియో వాతావరణం, కెమెరాల సందడి, ఆర్టిస్ట్‌ల హడావుడి, వీటన్నిటికీ ఆకర్షితులయ్యాడు. ఆ తర్వాత ఆయన ధ్యాస, శ్వాస సినిమాయే అయ్యింది. 1958లో 9 నిమిషాల వ్యవధి గల 'ది లాస్ట్ గన్ ఫైటర్' సినిమా తీసాడు. బుల్లితెర మొదలుకుని వెండితెర వరకూ తనదయిన ముద్ర వేశాడు. 1968లో 'ఎస్కేప్ నో వే' అనే 40 నిముషాల సినిమాని రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొందించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రళయాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు.
స్పీల్ బెర్గ్ సృష్టిలో నుంచి వచ్చిన 'షుగర్ ల్యాండ్ ఎక్స్ ప్రె' గొప్ప విజయం సాధించింది. 'జాస్' సినిమా ప్రపంచ చలన చిత్రపటంలో చెరగని ముద్ర వేసింది. సముద్రంలో జల విలయాన్ని, ప్రళయాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించాడు స్పీల్ బెర్గ్. మూడేళ్ళ క్రితం ఈ సినిమా ముచ్చటగా మూడు దశాబ్దాల వేడుకను చేసుకుంది.1981లో 'రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్' సూపర్ హిట్‌గా నిలిచింది. 'ఇండియానా జోన్స్', 'ది టెంపుల్ ఆఫ్ ది డూమ్' చిత్రాలు సాహస చిత్రాలు నిర్మించాలనుకునే ఔత్సాహికులకు పాఠ్య పుస్తకాలుగా నిలిచాయి. ఇక వర్ణ వివక్ష మీద స్పీల్‌బెర్గ్ తీసిన చిత్రం 'ది కలర్ పర్పుల్' 1985లో విడుదలైంది. బుకర్ బహుమతి పొందిన ఓ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది.
మైఖేల్ క్రిచ్ టన్ నవల ఆధారంగా 'జురాసిక్ పార్క్' చిత్రాన్ని స్పీల్‌బెర్గ్ రూపొందించాడు. ఈ చిత్రం తర్వాత డైనోసార్లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. పుస్తకాలు, మ్యూజియంలు.. ఇలా వాటికి సంబంధించి అనేక ఆవిష్కరణలు జరిగాయి.
ఆ చిత్రాలతో నడిచొచ్చిన ఆస్కార్
నాజీల కాలం నాటి ఇతివృత్తం తీసుకుని 1993లో 'షిండ్లర్స్ లిస్ట్' చిత్రాన్ని స్పీల్‌బెర్గ్ రూపొందించాడు. కలర్ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో నాజీల చరిత్రని కళ్ళకు కట్టే విధంగా బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా ఉత్తమ దర్శకుడిగా స్పీల్ బెర్గ్ ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.
1998లో 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ చిత్రాన్ని యుద్ధ భీభత్సం నేపథ్యంలో రూపొందించాడు. ఈ సినిమాకు రెండోసారి ఆస్కార్ అవార్డుని అందుకున్నాడు. 2002లో ‘మైనార్టీ రిపోôర్ట్, 'క్యాచ్ మీ యు కెన్' సినిమాలు సంచలన విజయాల్ని నమోదు చేశాయి. ఇక 2004లో 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' చిత్రం ద్వారా రోబోలు సమాజంలో ఎంతటి ప్రభావం చూపిస్తాయో చూపించాడు. 2005లో హెచ్. జి .వెల్స్ నవల 'వార్ ఆఫ్ ది వరల్డ్స్' తెరకి ఎక్కించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సాంకేతికతకు పెద్దపీట
వెండి తెరపై సాంకేతిక ప్రదర్శనకు పరాకాష్ట ‘జురాసిక్ పార్క్’ 1993లో 'జురాసిక్ పార్క్' తీసిన స్పీల్‌బెర్గ్.. 1997లో 'ది లాస్ట్ వరల్డ్' పేరుతో జురాసిక్ పార్క్ రెండో భాగాన్ని తీశారు. 2011లో 'ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్', 'వార్ హౌ' సినిమాలు రూపొందించాడు. 2012లో 'లింక్లో', 2015లో 'బ్రిడ్జి ఆఫ్ స్పై', 2016లో 'ది బి ఎఫ్ జి', 2017లో 'ది పోస్ట్', 2018లో 'రెడీ ప్లేయర్ వన్' చిత్రాలు స్పీల్‌బెర్గ్ దర్శకత్వంలో తెరకెక్కాయి.