ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' కథ లీక్ చేసిన వెన్నెల కిశోర్ - CINEMA VARTHALU

దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఓ హాస్యభరిత వీడియోను పంచుకుంది 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం. ఇందులో నటుడు వెన్నెల కిశోర్.. సినిమా కథ చెబుతూ కనిపించాడు.

'సరిలేరు నీకెవ్వరు' కథ లీక్ చేసిన వెన్నెల కిశోర్
author img

By

Published : Oct 27, 2019, 3:12 PM IST

Updated : Oct 27, 2019, 3:17 PM IST

మహేశ్​బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కథ లీకైంది. చేసింది బయటవారు ఎవరో అనుకుంటే, మీరు పొరబడినట్లే. చిత్రంలోని సన్నివేశాల గురించి చెప్పింది హాస్యనటుడు వెన్నెల కిశోర్​. కాకపోతే ఇదంత హాస్యభరితంగానే జరగడం విశేషం. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​.. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఈ వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది.

క్రైమ్ బ్రాంచ్​ కోటి(సుబ్బరాజు), అతడి అసిస్టెంట్​ కిశోర్(వెన్నెల కిశోర్)​ను ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన ఓ రిపోర్టర్..​ సినిమా విశేషాలు అడగ్గా "ట్రైన్ ఎపిసోడ్.. కర్నూలు ఎపిసోడ్.. ఆ తర్వాత సార్(క్రైమ్ బ్రాంచ్​ కోటి) ఎంట్రీ.. ప్రకాశ్ రాజ్, ఆ తర్వాత రష్మిక... రష్మిక వచ్చిన తర్వాత హీరో వస్తారు.." అంటూ సాగుతున్న ఈ వీడియో అలరిస్తోంది.

దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి.. ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్​రాజు, అనిల్ సుంకర, మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రానుందీ చిత్రం.

ఇది చదవండి: దీపావళికి కొత్త పోస్టర్ల ధమాకా.. జోష్​లో అభిమానులు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 27, 2019, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.