'కేజీఎఫ్'తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్. ఈ రోజు అతడి పుట్టినరోజు సందర్భంగా తన భార్య రాధికా పండిట్.. ఈ కన్నడ హీరోకు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. కూతురుతో కలిసి కేక్ తయారు చేస్తూ.. వీడియో రూపొందించి అతడికి బర్త్ డే విషెస్ చెప్పింది.
-
💥SURPRISE!💥
— Yash (@TheNameIsYash) January 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
We’ve taken over your account like we’ve taken over your life. 😍
Happy birthday🎂to the one and only #RockingStar⭐️from your biggest fans! 🥰
#hackedwithlove #ayradhika #rockinghabba2020 pic.twitter.com/92AUYnHuzm
">💥SURPRISE!💥
— Yash (@TheNameIsYash) January 7, 2020
We’ve taken over your account like we’ve taken over your life. 😍
Happy birthday🎂to the one and only #RockingStar⭐️from your biggest fans! 🥰
#hackedwithlove #ayradhika #rockinghabba2020 pic.twitter.com/92AUYnHuzm💥SURPRISE!💥
— Yash (@TheNameIsYash) January 7, 2020
We’ve taken over your account like we’ve taken over your life. 😍
Happy birthday🎂to the one and only #RockingStar⭐️from your biggest fans! 🥰
#hackedwithlove #ayradhika #rockinghabba2020 pic.twitter.com/92AUYnHuzm
'సర్ప్రైజ్ మా ప్రాణానికి ప్రాణమైన రాకింగ్స్టార్కు నీ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని కూతురుతో కలిసి యశ్‌కు విషెస్ చెప్పింది రాధిక. ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడీ కన్నడ హీరో. ఈ రోజుతో యశ్‌కు 34 ఏళ్లు నిండాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ నాలుగు భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలో కేజీఎఫ్ చాప్టర్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యశ్. ఈ రోజు యశ్ బర్త్‌డే కానుకగా.. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యే అవకాశముంది.
ఇదీ చదవండి: ఈ సంక్రాంతి... సొగస్కాంతి