టాలీవుడ్ కథానాయకుడు రవితేజ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. తొలిసారి ప్రతినాయుకుడి ఛాయలున్న రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.
గతంలో రవితేజతో 'వీర' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు రమేష్. మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుండటం వల్ల అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రవితేజ.. 'విక్రమార్కుడు', 'దరువు', 'కిక్ 2', 'డిస్కోరాజా' చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి కథతోనే తెరపైకి రానుండటం వల్ల సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి...'మైదాన్'లో ప్రతీకారం తీర్చుకోవటానికి సై