చిన్ననాటి నుంచి డ్యాన్స్, డ్రామానే ప్రపంచంగా పెరిగిన నటి వేదిక.. ప్రేమ లేకుంటే జీవితమే లేదని అంటోంది. అందరి జీవితాల్లోని ప్రేమకు తప్పక చోటుంటుందని, కొన్నిసార్లు 'హార్ట్ బ్రేక్' అవుతుంటుందని చెబుతోంది. తన జీవితంలోనూ ప్రేమ వైఫల్యంతో పాటు కెరీర్ పరంగా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నానందీ భామ.
" నా దృష్టిలో ప్రేమ లేకపోతే జీవితమే లేదు. అందరి జీవితాల్లోనూ ప్రేమకు చోటుంటుంది. 'హార్ట్ బ్రేక్' కావడమూ ఉంటుంది. నా జీవితంలో రిలేషన్షిప్ పరంగానే కాకుండా, కెరీర్ పరంగా 'హార్ట్ బ్రేక్స్' ఉన్నాయి. వాటిని అధిగమించినప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇంకో అయిదేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నా. కాబోయే వాడిలో నిజాయతీ, హాస్య చతురత తప్పనిసరిగా ఉండాలి" -వేదిక, హీరోయిన్
ఇటీవలే వచ్చిన 'రూలర్' సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన మెరిసిందీ భామ. తన కెరీర్లో 2006 నుంచి ఇప్పటివరకు 22 సినిమాల్లో నటించింది.