హీరోహీరోయిన్లకు అభిమానులు ఉండటం సహజమే. కొన్నిసార్లు ఈ అభిమానమే హద్దులు దాటుతుంటుంది. ఆరాధ్య నటుల కోసం కొన్నిసార్లు శ్రుతిమించిన పనులు వేస్తుంటారు. ఇలాంటి ఓ వ్యక్తే.. హీరోయిన్ పూజా హెగ్డే కంటపడ్డాడు. అతడు ఈమె కోసం ఏకంగా ఐదు రోజులు ఫుట్‌ఫాత్‌పై పడుకొని ఎదురుచూశాడంటే మీకు ఆశ్చర్యం కలగకమానదు.
భాస్కర్‌రావు.. హీరోయిన్ పూజా హెగ్డేను చూసేందుకు ముంబయి వెళ్లాడు. అక్కడ ఆమె కోసం ఐదు రోజులు ఎదురుచూశాడు. ఫుట్‌పాత్‌పై పడుకుని కాలం గడిపాడు. పూజ తనను చూసి పలకరించగానే మురిసిపోయాడు. జరిగిన విషయాన్ని ఆమెకు వివరించాడు. అభిమానిని పలకరించిన పూజ.. ఇలాంటి పనులు మరోసారి చేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇవీ చూడండి.. 'గంగూబాయ్' పాత్రలో మెప్పిస్తోన్న ఆలియా