ఆలియా భట్ 'ఆర్.ఆర్.ఆర్'ను వదిలి వెళ్లిపోయిందట. రాజమౌళినే స్వయంగా ఆమెను దగ్గరుండి సంతోషంగా సాగనంపారట. అదేంటి.. ఆలియా సినిమా నుంచి తప్పుకుంటే జక్కన్న ఆనందంగా పంపడమేమిటని అనుకుంటున్నారా! ఈ సినిమాలో ఆలియాకు సంబంధించిన పాత్ర చిత్రీకరణ పూర్తయిందట. అందుకే చిత్ర బృందం ఆమెకు ఘనంగా వీడ్కోలిచ్చినట్లు తెలుస్తోంది.
ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియాను తీసుకుంది చిత్రంబృందం. సినిమాలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ ఎంతో ప్రాధాన్యముంటుందని సమాచారం.
కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. తారక్ సరనస హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ కనిపించనుంది. త్వరలో వీరిద్దరి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అనంతరం క్లైమాక్స్ సీన్‌ను తెరకెక్కిస్తారని సమాచారం.
దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే 70శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.
ఇదీ చదవండి: అల్లుడు శీనుతో 'ఇస్మార్ట్ భామ' రొమాన్స్..!