హైదరాబాద్ నిజాంపేటలోని లక్ష్మీవిల్లాస్లో 8 నెలలుగా బాధితురాలితో పాటు ఆమె సోదరి, ఓ చిన్నారి నివాసముంటున్నారు. ఓ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోన్న బాధితురాలి సోదరి... ఉదయాన్నే పాఠశాలకుకి వెళ్ళిపోయింది. వివాహ సంబంధం గురించి మ్యాట్రిమొనీ సంస్థ నుంచి శనివారం మద్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 8 మంది వారి ఇంటికి వచ్చారు. 3 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు.
మధ్యాహ్నం ఇంటి నుంచి అరిచిన శబ్ధం వచ్చిందని... వెళ్ళి చూస్తే తాళం వేసి ఉందని ఇంటి యజమాని భార్య తెలిపింది. అయితే సాయంత్రం ఓ యువకుడు కంగారుగా బయటకు వెళ్ళాడని తెలిపింది.
సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన సోదరి ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించింది. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు... జాయల్చంద్ ఈ అఘాయిత్యానికి పాల్పడట్టుగా తెలుసుకున్నారు. నిందితుడి కోసం సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టారు.
ఇవీ చూడండి: శంషాబాద్ నిందితులను పట్టించిన ఫోన్ కాల్