ETV Bharat / jagte-raho

'జస్టిస్​ ఫర్​ దిశ' కేసులో వేగవంతమైన విచారణ

సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు జస్టిస్​ ఫర్​ దిశ హత్య కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు వీలైనంత త్వరగా అభియోగపత్రం రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.

investigation
investigation
author img

By

Published : Dec 2, 2019, 8:03 AM IST

'జస్టిస్​ ఫర్​ దిశ' కేసులో వేగవంతమైన విచారణ
జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యాచారం, హత్య కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం వల్ల పోలీసులు వీలైనంత త్వరగా అభియోగపత్రం రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఘటనాస్థలంలో బాధితురాలికి సంబంధించిన వస్తువులు మొదలుకొని హత్య అనంతరం ఆమెను దహనం చేసేందుకు నిందుతులు పెట్రోల్‌బంక్‌లో ఇంధనం కొన్న ఆధారాలు సహా అన్ని సేకరిస్తున్నారు.

నలుగురు నిందితులపై నమోదైన కేసులు

నలుగురు నిందితులపై 120(బి), 366, 506, 376-డి, 302, 201 ఆర్‌, డబ్ల్యు 34, 392 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరిన్ని సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించే పనిలో సైబరాబాద్‌ పోలీసులు నిమగ్నమయ్యారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక అందిన వెంటనే అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలో గత జూన్‌లో 9 నెలల చిన్నారిని అపహరించి అత్యాచారం చేసిన కేసులో మాదిరిగానే త్వరితగతిన తీర్పు వచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నిందితులను కస్టడీ ఇవ్వాలని ఇవాళ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

TG_HYD_05_02_FAST_INVESTIGATION_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్య కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పాశవిక అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో నలుగురు నిందితులపై 120(బి), 366, 506, 376-డి, 302, 201 ఆర్‌, డబ్ల్యు 34, 392 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరసమైన సాక్ష్యాధారాలను పకడ్భందీగా సేకరించే పనిలో సైబరాబాద్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. V.O:జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యాచారం కేసులో వేగవంతమైన విచారణ జరిపించనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు వీలైనంత త్వరగా అభియోగపత్రం రూపొందించేందుకు సిద్దమవుతున్నారు. ఘటనస్థలంలో బాధితురాలికి సంబంధించిన వస్తువులు మొదలుకొని హత్య అనంతరం ఆమెను దహనం చేసేందుకు నిందుతులు పెట్రోల్‌బంక్‌లో ఇంధనం కొన్నట్లు ఆధారాలు సేకరించడం వరకు పకడ్భందీగా ఆధారాలు సిద్దం చేస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక అందిన వెంటనే అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. వరంగల్‌ జిల్లా హన్మకొండ లో గత జూన్‌లో 9 నెలల చిన్నారిని అపహరించి అత్యాచారం చేసిన కేసులో మాదిరిగానే త్వరితగతిన తీర్పు వచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనలో న్యాయస్థానం 56 రోజుల్లోనే తీర్పు వెలువరించింది. రెండు నెలలు మించకుండానే తీర్పు వెలువడిన తీరుపై ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. తాజాగా దిశ కేసులోనూ పోలీసులు మోపిన అభియోగాలు గనుక న్యాయస్థానంలో రుజువైతే నిందితులకు మరణశిక్ష వరకు విధించే అవకాశముండటం గమనార్హం. మరో వైపు నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన పోలీసులు కేసును మరింత పకడ్భందీగా మలిచేందుకు అదనపు సమాచార సేకరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నిందితులను కస్టడీ ఇవ్వాలని ఇవాళ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. E.V.O: ఈ కేసులో నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి కోరాలని అధికారులు నిర్ణయించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.