తాను ప్రేమించినవాడికి ఇంతకు ముందే పెళ్లైన విషయం తెలుసుకుని చిత్తూరు జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. డిగ్రీ చదువుతున్న యువతి ఇబ్రహీం అనే యువకుణ్ని ప్రేమించింది. తనకు పెళ్లైన విషయం దాచిపెట్టి ఇబ్రహీం ఆమెను మోసం చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఈ నెల 13న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇబ్రహీంను అరెస్టు చేయాలని యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నిందితుణ్ని పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి