సజ్జనార్ ఇప్పుడు ఈ పేరే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది. అప్పట్లో వరంగల్ యాసిడ్ దాడి ఘటనలో అప్పుడు ఎస్పీగా ఉన్న సజ్జనార్ తన బృందంతో నిందితులకు ఎన్‌కౌంటర్‌తో చెక్‌పెట్టారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సజ్జనార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. యాసిడ్ దాడి నిందితులకు సరైన శిక్ష పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు షాద్‌నగర్
ఇప్పుడు షాద్‌నగర్ చటాన్‌పల్లి ఘటనలోనూ సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నారు. నేరం జరిగిన తీరు అత్యంత అమానుషంగా ఉండటంతో అందరూ సజ్జనార్ మరోసారి సంచలనం సృష్టిస్తారనే అంచనాకు వచ్చారు.
ఎన్కౌంటర్
అనుకున్నట్లుగానే దిశాను రేప్ చేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన రేపిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాహో సజ్జనార్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.''