ETV Bharat / jagte-raho

వరుస దొంగతనాలు... ప్రజల్లో భయాందోళనలు - latest chori news in prakasham district

ప్రకాశం జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వరుస దొంగతనాలతో... ప్రజల్లో భయందోళనలు
author img

By

Published : Nov 11, 2019, 10:31 AM IST

Updated : Nov 11, 2019, 12:22 PM IST

వరుస దొంగతనాలతో... ప్రజల్లో భయాందోళనలు

ప్రకాశం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. నిందితుల వేటలో పోలీసులు ఉండగానే కొత్త చోరీ ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని కొరిసపాడు, పంగులూరు పట్టణ శివారు ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి ముందు, బజారులో పార్కింగ్ చేసిన వాహనాలు తీసుకెళ్లిపోతున్నారు. పంటపొలాల వద్ద విద్యుత్ పరికరాలు సైతం మాయమవుతున్నాయి.

తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా

తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని... రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒకవైపు పోలీసులు హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా దొంగతనాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీర్థయాత్రలకు వెళ్లే వారు ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ ద్వారా తమకు తెలియపరిస్తే తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రచారాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ప్రయాణికులే లక్ష్యం... కాపుకాసి బంగారు ఆభరణాలు మాయం

Intro:Body:Conclusion:
Last Updated : Nov 11, 2019, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.