ETV Bharat / jagte-raho

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా.!?

హైదరాబాద్​ బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏఎస్సై నరసింహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ... ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నీళ్ల ట్యాంకు ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.

asi-narasimha-attempted-suicide-at-balapur-police-station-hyderabad
author img

By

Published : Nov 22, 2019, 6:13 PM IST

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?

హైదరాబాద్ బాలాపూర్​ పోలీస్​స్టేషన్​ సమీపంలో ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నీళ్ల ట్యాంకు పైకి ఎక్కిన ఏఎస్సై నరసింహా... ఒంటిపై పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు నీళ్ల ట్యాంకు ఎక్కినప్పుడు కానిస్టేబుళ్లు వారించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. తోటి పోలీస్​ అతన్ని రక్షించి కిందికి దింపాడు. నరసింహా ఛాతిభాగానికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. 20 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో... అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...?

బాలాపూర్​ పీఎస్​లో నరసింహా ఏఎస్సైగా విధులు నిర్వహించేవాడు. ఇటీవల అతన్ని మంచాల్ పీఎస్​కు బదిలీ చేశారు. గురువారం అక్కడికి వెళ్లి రిపోర్టు చేశారు. అయితే బాలాపూర్​ సీఐ సైదులు... తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నివేదిక ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు బదిలీ చేశారని నరసింహా ఆరోపించారు. ఎల్బీనగర్​ డీసీపీ సన్​ప్రీత్​సింగ్​, వనస్థలిపురం ఏసీపీ జయరాంతోపాటు ఇతర ఉన్నతాధికారులు అపోలో ఆసుపత్రికి వచ్చి నరసింహా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో వరుసగా మూడో రోజూ బంద్

TG_HYD_36_22_ASI_SUICIDE_ATTEMPT_TS10003_TS10014 కంట్రిబ్యూటర్-సుల్తాన్, శ్రీరామ్ నోట్- ఫీడ్ డెస్క్ వాట్సాప్ కు వచ్చింది. ( ) బాలాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి చేసుకున్నాడు. నీళ్లట్యాంకు పైకి ఎక్కిన ఏఎస్సై నరసింహ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు నీళ్ల ట్యాంక్ ఎక్కినప్పుడు తోటి కానిస్టేబుళ్లు వారించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. తోటి పోలీస్ అతన్ని రక్షించి వెంటనే కిందికి దింపాడు. చాతిభాగం కాలడంతో వెంటనే డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. 20శాతానిపైగా కాలిన గాయాలు కావడంతో అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. నరసింహ బాలాపూర్ పీఎస్ లో ఏఎస్సైగా విధులు నిర్వహించేవాడు. ఇటీవల అతన్ని మంచాల పీఎస్ కు బదిలీ చేశారు. నరసింహపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు బదిలీ చేశారు. గురువారం నాడు మంచాల పీఎస్ కు వెళ్లి రిపోర్టు చేసి వచ్చారు. అయితే బాలాపూర్ సీఐ సైదులు... తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నివేదిక ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు బదిలీ చేశారని నరసింహ ఆరోపించారు. ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ జయరాంతో పాటు ఇతర ఉన్నతాధికారులు అపోలో ఆస్పత్రికి వచ్చి నరసింహ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు......SPOT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.