అత్యాధునిక ఆయుధాలు తయారు చేయడంలో రష్యా ముందుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో హైపర్సోనిక్ క్షిపణలు కలిగిన ఏకైక దేశంగా రష్యా నిలిచిందని వెల్లడించారు. సరికొత్త ఆయుధాలను రూపొందించటంలో చరిత్రలో తొలిసారి అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టామని స్పష్టం చేశారు.
రక్షణశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంగా ఆయుధాల తయారీపై కీలక వ్యాఖ్యలు చేశారు పుతిన్.
అమ్ములపొదిలోకి..ఏహెచ్జీవీ
అవాన్గార్డ్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్(ఏహెచ్జీవీ)తో కూడిన తొలి వాహనం ఈ నెలలో దేశ అమ్ములపొదిలోకి చేరనుందని వెల్లడించారు అధ్యక్షుడు. ఇప్పటికే కింజ్హాల్ హైపర్సోనిక్ క్షిపణులు సేవలందిస్తున్నాయని స్పష్టం చేశారు. 2018 మార్చిలో జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా అవాన్గార్డ్, కింజ్హాల్ క్షిపణుల వ్యవస్థపై వెల్లడించారు పుతిన్. అవాన్గార్డ్ క్షిపణి అనేది భవిష్యత్తు ఆయుధంగా పేర్కొన్నారు.
ధ్వని వేగానికి 20 రెట్లు అధికంగా..
అవాన్గార్డ్ హైపర్సోనిక్ క్షిపణి ధ్వని వేగానికి 20 రెట్ల అధిక వేగంతో ప్రయాణించి ఖండాంతర లక్ష్యాలను ఛేదించగలదు. ఆయుధాల సామర్థ్యం ఔన్నత్యాన్ని మార్చుకుంటూ.. సురక్షిత మార్గం గుండా దూసుకెళ్తూ లక్ష్యాలను మట్టుపెడుతుంది. కింజ్హాల్ అనేది మిగ్-31 యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. ఇది ధ్వని వేగానికి 10 రెట్లు అధిక వేగంతో 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.
అమెరిక, ఇతర దేశాలు హైపర్సోనిక్ ఆయుధాలను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నప్పటికీ..పూర్తి స్థాయిలో ఈ క్షిపణులు కలిగిన దేశాలుగా అవతరించలేదు.
ఇదీ చూడండి: మంగోలియా మంచు ఎడారిలో అదిరే ఆటలు