మిలిటరీ విమానం అనుకుని స్పైస్ జెట్ సంస్థకు చెందిన ఓ సాధారణ విమానాన్ని... పాక్‌కు చెందిన రెండు ఎఫ్-16 యుద్ధవిమానాలు వెంబడించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 23న దిల్లీ నుంచి అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌కు 120 మంది ప్రయాణికులతో బయలు దేరింది స్పైస్ జెట్ విమానం.
రేడియో కమ్యూనికేషన్ కోసం స్పైస్ జెట్ విమానానికి కేటాయించిన సంకేతం విషయంలో గందరగోళం తలెత్తింది. ఈ నేపథ్యంలో జెట్ విమానాన్ని మిలిటరీ విమానంగా పాక్ అధికారులు పొరబడ్డారు. తమ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే విమానాన్ని రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలతో వెంబడించారు.
ఇదీ చూడండి:అక్టోబర్ 24 వరకు ఈడీ కస్టడీలో చిదంబరం