ETV Bharat / international

కంచెను ఢీకొని కూలిన విమానం.. నలుగురు మృతి - Four people were killed at California airfield

​​​​​​​దక్షిణ కాలిఫోర్నియాలో ఓ మినీ విమానం కూలిపోయి నలుగురు మరణించారు. టేక్​ఆఫ్ అవుతున్న క్రమంలో విమానాశ్రయం చుట్టూ ఉండే కంచెను ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగి.. రన్​వేకు సమీపంలో కూలిపోయింది. ప్రమాదం అనంతరం విమానాశ్రయాన్ని మూసివేశారు అధికారులు.

Crash of a small airplane at a Southern California airfield
కాలిఫోర్నియాలో కూలిన విమానం... నలుగురు మృతి
author img

By

Published : Jan 23, 2020, 12:16 PM IST

Updated : Feb 18, 2020, 2:33 AM IST

దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం ఓ మినీ విమానం ప్రమాదానికి గురైంది. టేక్​ఆఫ్​ చేస్తున్న క్రమంలో విమానాశ్రయం చుట్టూ ఉండే కంచెను ఢీకొట్టి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

కూలిన విమాన ప్రాంతంలో గాలింపు చర్యాలు చేపట్టిన అగ్నినమాపక అధికారులు

ఇదీ జరిగింది...

కాలిఫోర్నియాలోని కరోనా మున్సిపల్​ విమానాశ్రయం నుంచి టేక్​ఆఫ్​ అవుతున్న క్రమంలో మూడు అడుగుల ఎత్తుగల కంచెను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వెంటనే మంటలు అంటుకుని రన్​వేకు కొద్ది దూరంలో కూలిపోయినట్లు వెల్లడించారు.

విమానాశ్రయానికి తూర్పు భాగంలో దగ్ధమైన విమానాన్ని గుర్తించారు అధికారులు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందినట్లు నిర్ధరించారు అధికారులు.

విమానాశ్రయానికి అతి సమీపంలో ప్రమాదం జరిగిన కారణంగా రన్​వేను మూసివేశారు అధికారులు. ఇక్కడకు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు.

ఇదీ చదవండి: రహదారి నిర్మాణ యంత్రాలను తగలబెట్టిన నక్సల్స్

Intro:Body:

https://twitter.com/ANI/status/1220144683155890176

Conclusion:
Last Updated : Feb 18, 2020, 2:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.