ETV Bharat / city

'ఈటీవీ భారత్​ రుణం ఇలా తీర్చుకున్నారు..!' - visakha couple thanks to etv bharath by named their baby

ఆమె నిండు గర్భిణీ మరో వారంలో ప్రసవం.. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం బంతి పూల గంప ఎత్తుకొని 5 కిలోమీటర్లు నడిచి సంతకు వెళ్లేది. ఆ గర్భిణి కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రసారం చేసిన కథనాల ద్వారా ఆమెకు ఆర్థిక, వైద్య సహాయాలు అందాయి. ఈ సహాయానికి సంతోషించిన ఆ చిరు కుటుంబం తమ కుమార్తెకు ఈటీవీ భారత్​ రుణం తీర్చుకునేలా.. భారతి అని పేరు పెట్టుకుంది. విశాఖ జిల్లా పాడేరులో జరిగిన కథ మనమూ తెలుసుకుందామా..!

'ఈటీవీ భారత్​ రుణం ఇలా తీర్చుకున్నారు..!'

author img

By

Published : Dec 30, 2019, 4:20 AM IST

Updated : Dec 30, 2019, 9:09 AM IST

తమ బిడ్డకు ఈటీవీ భారత్​ పేరు కలిసేలా నామకరణం చేసిన దంపతులు

విశాఖ జిల్లా పాడేరు మండలం బరిసింగికి చెందిన అరుణ... గర్భిణిగా ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు పడింది. ఎనిమిదో నెల గర్భం ఉన్న సమయంలోనూ కుటుంబ పోషణ కోసం 15 కిలోల బరువున్న బంతిపూల గంపలను మోసుకుంటూ 5 కిలోమీటర్ల దూరంలోని సంతకు వెళ్లేది. అరుణ కష్టాలను ఈటీవీ, ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చాయి. వరుస కథనాలతో ఆమె సమస్యలను ప్రపంచానికి తెలిసేలా చేశాయి.

స్పందించిన మహిళా కమిషన్​ సభ్యులు

అరుణ గురించి తెలుసుకున్న మహిళా కమిషన్ సభ్యులు.... బరిసింగికి వెళ్లి ఆమెకు సీమంతం చేశారు. ప్రసవం సమయంలో ఆస్పత్రికి వెళ్లగా..... అరుణకు రక్తం సరిపడా లేదని వైద్యులు విశాఖలోని కేజీహెచ్​కు సిఫార్సు చేశారు. అప్పుడు కూడా..... ఆమెకు మాజీ మంత్రి మణికుమారి ద్వారా కొంత ఆర్థిక సహాయం అందించి.... అధికారుల సాయంతో రక్తం అందేలా చేసింది ఈటీవీ భారత్. నవంబర్ 30న ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది.

రుణం తీర్చుకున్నారు

కష్టాల్లో ఉన్నప్పుడు తనను ఆదుకున్న ఈటీవీ, ఈటీవీ భారత్​ రుణం తీర్చుకోవాలన్న అరుణ దంపతులు.... తమ కూతురుకు భారతి అని పేరు పెట్టారు. అబ్బాయి అయితే భారత్ అని పెట్టేవారమని చెప్పారు. పుట్టుక నక్షత్రం కూడా భారతి నామకరణానికి సరిపోవటంతో వారు అనుకున్న కల నెరవేరింది. ఆదివారం నామకరణ మహోత్సవం జరిపారు.

ఇదీ చూడండి:

హలో లేడీస్... మిమ్మల్నే... రన్నింగ్​కు వెళ్తున్నారా..?

Intro:ap_vsp_78_29_aruna_daughter_name_bharathi_avb_vo_ap10082 నోట్: స్క్రిప్ట్ ftp... ftp: మరో ఫైల్ ..... ap_vsp_78_29_aruna_daughter_name_bharathi_av1_ap10082 .....

Body:9493274036

Conclusion:shiva
Last Updated : Dec 30, 2019, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.