సాగరతీరం విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఉత్సవ్ వేడుకలు నగరవాసులను విశేషంగా అలరించాయి. ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఆయన భార్య కీర్తి పాటలు పాడి సందడి చేశారు. వారు పాడుతున్నంత సేపూ నగరవాసులు చప్పట్లతో ప్రోత్సహించారు. రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు సైతం కలెక్టర్ దంపతుల పాటకు ఫిదా అయ్యారు. వారిని పొగడ్తలతో ముంచెత్తారు.
ఇదీ చూడండి:
తితిదే ఆడిట్ బాధ్యతలు కాగ్‌కి అప్పగించాలి: సుబ్రహ్మణ్య స్వామి