ఇసుక కొరతపై వచ్చే నెల 3న విశాఖలో జనసేన తలపెట్టిన ర్యాలీకి... తెదేపా మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెదేపా తరఫున సీనియర్ నేతలు జనసేన ర్యాలీలో పాల్గొంటారని చంద్రబాబు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా... విశాఖలో జనసేన నిర్వహించే ర్యాలీకి మద్దతు కోసం చంద్రబాబుకు పవన్ బుధవారం ఫోన్ చేశారు. పవన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు... జనసేన ర్యాలీకి తెదేపా మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఇదీ చదవండి :