స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలు చేరుకోవడంలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన నగరాలుగా అమరావతి, విశాఖ నగరాలు అవార్డులు సాధించాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖలో 'ఆకర్షణీయ నగరాల' అంశంపై మూడో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ప్రజల కోసం నగరాల నిర్మాణం అనే అంశంపై రెంజు రోజుల సదస్సు ఇవాళ ప్రారంభమయ్యింది. స్మార్ట్ సిటీల దిశగా వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంశంలో అమరావతికి, ముడసర్లోవలో ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుపై విశాఖకు అవార్డులు వచ్చాయి. అత్యుత్తమ ప్రదర్శనతో సూరత్ నగరం 'సిటీ' అవార్డును గెలుచుకుంది.
ప్రముఖ నగరాలకూ అవార్డులు
పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం ఇలా వివిధ రంగాల్లో తమిళనాడు రాష్ట్రానికి అవార్డు దక్కింది. మిగిలిన విభాగాల్లోనూ ప్రముఖ నగరాలు అవార్డులను కైవసం చేసుకున్నాయి.
ఇదీ చూడండి: