ఈ నెల 10,11 తేదీల్లో విశాఖ సిట్ మధ్యంతర నివేదిక - sit report on land pooling in visakha district
విశాఖ జిల్లాలో భూఅక్రమాలపై ప్రభుత్వం నియమించిన సిట్... ఈ నెల 10,11వ తేదీల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పిస్తామని ఛైర్మన్ డా.విజయ్ కుమార్ వెల్లడించారు. తమకు వచ్చిన 2434 ఫిర్యాదుల్లో 918 సిట్‌కు సంబంధం లేనివిగా గుర్తించామన్నారు. ఈ ఫిర్యాదులను 3 అంశాలుగా విభజించి పరిశీలించామని పేర్కొన్నారు. అన్ని కేసులకు సంబంధించి భూమి విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. కేసులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇస్తామని... కాని వాటిపై చర్యలు తీసుకోవడం తమ పరిధిలోకి రాదన్నారు. రెండు కేసుల్లో క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 10,11 తేదీల్లో విశాఖ సిట్ మధ్యంతర నివేదిక
sample description
TAGGED:
vizag sit latest news