బంగాళాఖాతం తీరంలో టైగర్ ట్రంప్ - 2019 విన్యాసాల కోసం అమెరికా యుద్ధ నౌక.. జర్మన్ టౌన్ విశాఖ తీరానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య మిలటరీ సహకారానికి ఈ విన్యాసాలు ఓ ఉదాహరణ అని భారత్లో అమెరికా అంబాసిడర్ కెన్నత్ జస్టర్ అభివర్ణించారు. ఇరుదేశాల త్రివిధ దళాల సైనికులు పరస్పర సందర్శనలు, సమావేశాలు, లైవ్ ఫైర్ డ్రిల్లులు, భారత హెలీకాప్టర్ల విన్యాసాలు.. జర్మన్ టౌన్ పై లాండింగ్ వంటివి తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ విన్యాసాలను రెండు రక్షణ దళాలు చేపడతాయి. భారత నౌకాదళం నుంచి యుద్ధ నౌకలు జలాశ్వ, ఐరావత్, సంధ్యాక్.. పదాతి దళం నుంచి 19 మద్రాస్, 7 గార్డ్స్ పటాలాలకు చెందిన సైనికులు హాజరయ్యారు. వాయు సేన నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్లు, రాపిడ్ యాక్షన్ మెడికల్ టీం(ఆర్.ఎ.ఎం.టి.) సిబ్బంది పాల్గొంటున్నారు.
ఇదీ చదవండి: