రేపు.. నౌకా దళ దినోత్సవం సందర్భంగా..నేవీ ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. నేవీకి ఉన్న ఆయుధాలు, ఇందులో ఉన్న అవకాశాలు వంటి అంశాలతో ఈ ప్రచార చిత్రం రూపొందించారు. అగ్ర సినిమాలను తలదన్నేలా రూపొందిన ఈ ప్రచార చిత్రం.. ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నావికాదళ శక్తిని చాటుతోంది. టీజరే ఇలా ఉంటే.. ఇక విన్యాసాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో అన్నమాట వినిపిస్తోంది.
రేపు జరగనున్న నావికా దినోత్సవం సందర్భంగా... తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో.. వందల సంఖ్యలో నావికులు విశాఖ సాగర తీరంలో సాహస విన్యాసాలు చేయనున్నారు. గత వారం రోజులుగా ఆర్కే బీచ్లో సన్నాహకంగా విన్యాసాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: