కేరళలో రెండు హత్యలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నేరస్తులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 11న కేరళలో రెండు హత్యలు చేసి అక్కడి నుంచి భారీగా నగదు, బంగారంతో పరారయ్యారు. నిందితులు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నట్లు కేరళ పోలీసులకు సమాచారం రావడంతో వారు విశాఖ పోలీసులకు సమాచారమిచ్చారు. విశాఖలో నిందితులను లబులు, జ్యువెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల నుంచి పోలీసులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి: