విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని మాజీమంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్టీల్ ప్లాంట్ స్థలాన్ని సౌత్ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి ఇస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కర్మాగారం కోసం రైతులు ఇచ్చిన భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం మానుకోవాలని.. లేకుంటే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి..
పుట్టపర్తిలో శ్రీకాకుళం భక్తులు... సత్యసాయికి ప్రత్యేక పూజలు