విశాఖ మన్యం పాడేరులో బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. ఆధార్ అనుసంధానం సహా పలు అవసరాల కోసం బ్యాంకులకు వస్తున్నవారి సంఖ్య ఎక్కువైంది. రోజుల తరబడి తిరుగుతున్నా బ్యాంకులో పనికావట్లేదని, సిబ్బంది స్పందించట్లేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, గ్రామీణ వికాస్ పాడేరు శాఖలు జనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. కనీసం ఖాతా పుస్తకం అప్‌డేట్ చేయట్లేదని ఖాతాదారులు వాపోయారు. కొంతమంది బ్యాంకులకు వచ్చేముందు భోజనం తెచ్చుకుని... సాయంత్రవరకూ క్యూలైన్లలో ఉంటున్నారు.
మన్యం ప్రజల అగచాట్లు... బ్యాంకుల వద్ద పడిగాపులు - bank rush in visakha paderu news updates
విశాఖ మన్యం పాడేరులో బ్యాంకులు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఆధార్ అనుసంధానం సహా ఇతర అవసరాలకు బ్యాంకుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. దీనివల్ల గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది.
విశాఖ మన్యం పాడేరులో బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. ఆధార్ అనుసంధానం సహా పలు అవసరాల కోసం బ్యాంకులకు వస్తున్నవారి సంఖ్య ఎక్కువైంది. రోజుల తరబడి తిరుగుతున్నా బ్యాంకులో పనికావట్లేదని, సిబ్బంది స్పందించట్లేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, గ్రామీణ వికాస్ పాడేరు శాఖలు జనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. కనీసం ఖాతా పుస్తకం అప్‌డేట్ చేయట్లేదని ఖాతాదారులు వాపోయారు. కొంతమంది బ్యాంకులకు వచ్చేముందు భోజనం తెచ్చుకుని... సాయంత్రవరకూ క్యూలైన్లలో ఉంటున్నారు.
శివ, పాడేరు
యాంకర్: విశాఖ మన్యం కేంద్రం పాడేరు లో బ్యాంకులు జన సముద్రాన్ని తలపిస్తున్నాయి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరుని దర్శనం అవుతుంది గాని పాడేరు లో బ్యాంకులు పనులు అవ్వట్లేదు అని జనాలు గగ్గోలు పెడుతున్నారు ప్రతి బ్యాంకు వద్ద బారులు తీరుతున్నారు సమస్య పరిష్కరించండి మహా ప్రభువు అంటూ నమస్కరిస్తున్నారు పాడేరు బ్యాంకులో గిరిజన కష్టాల పై కథనం.
వాయిస్1) విశాఖ ఏజెన్సీ లో బ్యాంకు కష్టాలు తీరడం లేదు, ప్రభుత్వ పథకాలు బ్యాంక్ ఎకౌంట్లో , నమోదు ఆధార్ అనుసంధానం వంటి కారణాలతో బ్యాంకు సిబ్బంది తలమునకలై ఉన్నారు . బ్యాంకు ఖాతాల గురించి గిరిజనం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు రోజుల తరబడి తిరుగుతున్న మా కష్టాలు పట్టించుకునే వాడు లేడు అంటూ మొరపెట్టుకున్నారు బ్యాంకుల వద్ద కి వెళ్ళగానే సిబ్బంది తక్కువ గా చూడటంతో మరింత అసహనానికి గురవుతున్నారు తమ డబ్బు వేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాలెస్ అంటూ బెంబేలెత్తుతున్నారు .జన కోలాహలం మధ్య పాడేరు యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇదేవిధంగా జనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. లైన్లో నిలబడినా కూడా తమ పనులు అవ్వట్లేదు అని గిరిజన పుత్రుల నిరాశ చెందుతున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు దూరప్రాంతాల నుంచి ఆటోలు జీపు ద్వారా వచ్చి డబ్బులు ఖర్చు అవుతుంది తప్ప తమ పనులు అవ్వట్లేదు అని ఆవేదన చెందుతున్నారు .
బైట్: రాజులమ్మ, వంటలమామిది
బైట్: ,రూపావతి, గబ్బంగి, పాడేరు
వాయిస్2)
పాస్ బుక్ ల నగదు నిల్వల అప్డేట్ చేసుకోడానికి కూడా అవకాశం లేకుండా ఉండడంతో ఎండలో కూర్చొని తలలు పట్టుకుంటున్నారు. యూనియన్ బ్యాంక్ బయట రోడ్లపై , జిరాక్స్ షాప్ వద్ద ఎకౌంట్ ఫారాలు నింపుతూ వారి కష్టాలు దిగమింగుకుంటూ ఉన్నారు తమ పని అయిపోతే బాగుండు అనుకుంటూ రోజుల తరబడి తిరుగుతూనే ఉన్నారు ఎండల్లో కూర్చుని వేడి తాళలేక గంటల తరబడి నిరీక్షించిన లేక మంచినీళ్లు, అంబలి తెచ్చుకుని ఎండలో తాగుతున్నారు. ప్రభుత్వ పథకాలకు అవసరమా అవ్వడానికి కొత్త అకౌంట్లు కోసం ఫారాలు తెచ్చుకుని ఎక్కడపడితే అక్కడే జనాలు పరీక్షలు ల్లా రాస్తున్నారు కొంతమందైతే పని అవకపోతే చెప్పేయండి వెళ్లిపోతాం అంటూ ప్రాధేయ పడుతున్నారు
బైట్3)
వాయిస్3) విశాఖ మన్యంలో ఐటీడీఏ పరిధిలో కోట్లాది రూపాయలు నిధులు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి వీటికోసం అదేవిధంగా ప్రభుత్వ పథకాల గిరిజన ప్రజల ఎకౌంట్లో పడేందుకు ఆధార్ లింక్ కేజీల అవసరం కావడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు కొత్త అకౌంట్లు కోసం కూడా క్యూలు కడుతున్నారు కొన్ని సందర్భాల్లో అయితే బ్యాంకు లింక్ కోల్పోవడంతో నెట్ ఆ రోజంతా గిరిజనం పడిగాపులు కాస్తూ డబ్బులు ఖర్చు చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. పాడేరు స్టేట్ బ్యాంకులో ఆధార్ నమోదు మార్పులు చేర్పులు కూడా అక్కడే జరగడంతో బ్యాంకు లోపలకు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంది.
ఎండ్ వాయిస్: అమాయక మైనటువంటి గిరిజనులకు సరైన దిశా నిర్దేశం లేకపోవడంతోనే అనేక అవస్థలు గురవుతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు పూర్తి స్థాయి సమీక్షించి ఈ బ్యాంక్ కష్టాలు గట్టెక్కించాలని గిరిజనులు కోరుతున్నారు.
శిva, పాడేరు
Body:శివ
Conclusion:9493274036