ETV Bharat / city

విశాఖ అథ్లెట్ల చిరకాల కల నెరవేరబోతుంది...! - Construction of Sports Complex on the cards

విశాఖ అథ్లెటిక్‌ క్రీడాకారులు చిరకాలంగా కోరుకుంటున్న సింథటిక్‌ ట్రాక్‌ ఆకాంక్ష నెరవేరనుంది. నగరంలో రెండు సింథటిక్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేసేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాయి. నగరంలోని కొమ్మాదిలో సింథటిక్‌ ట్రాక్లను ఏర్పాటుచేయనున్నారు. విశాఖ అగనంపూడిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

విశాఖ అథ్లెట్ల చిరకాల కల నెరవేరబోతుంది...!
author img

By

Published : Oct 13, 2019, 6:12 AM IST

విశాఖ అథ్లెట్ల చిరకాల కల నెరవేరబోతుంది...!
విశాఖలో అథ్లెటిక్‌ ట్రాక్​లు ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 'స్పోర్ట్స్‌ సిటీ'లు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖ అగనంపూడిలో 150 ఎకరాల్లో రూ.1300 కోట్లతో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపడతామని, ముందుగా విశాఖ, విజయనగరం, తిరుపతిల్లో ఈ స్పోర్ట్స్‌ సిటీలు ఏర్పాటవుతాయని వివరించారు. వీటిని పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రూపొందించనున్నట్టు ప్రకటించారు.

అగనంపూడిలో స్పోర్ట్స్​ సిటీ

అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించేందుకు తగిన సదుపాయాలను విశాఖలో కల్పిస్తున్నామని... అందులో భాగంగా విశాఖలో రెండు సింథటిక్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలోని కొమ్మాది ప్రాంతంలో ఏర్పాటవుతున్న స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో రూ.7 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ నిర్మిస్తున్నామన్నారు. అగనంపూడి స్పోర్ట్స్ సిటీకి సంబంధించి ఇప్పటికే 80 ఎకరాల స్థలం క్రీడల శాఖకు అప్పగించారని, రానున్న కాలంలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఏషియన్‌ గేమ్స్‌ వంటి అంతర్జాతీయ క్రీడలకు విశాఖ వేదికవనుందని క్రీడలు, యువజన శాఖ ఇన్‌చార్జి బి.శ్రీనివాసరావు అన్నారు.

ఎనిమిది లేన్ల ట్రాక్​లు

కేరళ రాజధాని తిరువనంతపురంలోనే ఆరు సింథటిక్‌ ట్రాక్‌లు ఉన్నయన్న శ్రీనివాసరావు... ఆ కారణంగానే కేరళ నుంచి పి.టి.ఉష, అంజూ జార్జ్ వంటి ఎంతమందో అథ్లెట్లు అంతర్జాతీయ క్రీడా వేదికలపై ప్రతిభను చాటరన్నారు. ఇప్పటివరకూ విశాఖ నగరంలోని మట్టి, పచ్చిక ట్రాక్‌లపై అథ్లెటిక్స్‌ అభ్యసిస్తున్న... ఔత్సాహిక క్రీడాకారులకు రానున్న కాలంలో ఎనిమిది లేన్ల సింథటిక్ ట్రాక్‌లు అందుబాటులోనికి వస్తే, వారి ప్రతిభ మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

ఇదీ చదవండి :

ఫిట్‌నెస్‌ కోసం క్రీడా సముదాయం... తితిదే ఉద్యోగులకు మరో వరం...

Intro:Ap_vja_05_13_ 5th_day_ Bull_race_in_gennavarem_av_Ap10052
Sai babu_ Vijayawada: 9849803586
యాంకర్: కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ ఒంగోలు వృషభ రాజములు బల ప్రదర్శన ఐదో రోజుకు చేరుకుంది.. ఐదో రోజు మొత్తం అం వివిధ రాష్ట్రాలకు చెందిన ఎడ్ల జత లో నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి.. మైలవరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మల్లాది విష్ణు లో లో ఐదోరోజు పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు స్థానిక వైకాపా నేత యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఐదో రోజు వేలాదిమంది బస్సు అభిమానులు రైతులు యువకులు పాల్గొని ప్రదర్శనను చివరకు ఆసక్తిగా తిలకించారు..
బైట్ : మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే
బైట్ : యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం వైకాపా సమన్వయకర్త..

Body:Ap_vja_05_13_ 5th_day_ Bull_race_in_gennavarem_av_Ap10052

Conclusion:Ap_vja_05_13_ 5th_day_ Bull_race_in_gennavarem_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.