ప్రభుత్వ భూములను వైకాపా నేతలకు చవకగా అమ్ముకుంటున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. నవరత్నాలు అమలులో ప్రభుత్వం విఫలమైందని స్పష్టమవుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు అమ్మకం అనే ప్రకటన కూడా త్వరలో చూస్తామని ఎద్దేవా చేశారు. అవి.. కేవలం వైకాపా కార్యకర్తలకు మాత్రమే అమ్ముకుంటారని దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో ప్రజా ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఉన్నది ప్రజల ఆస్తులు కాపాడేందుకని.. వాటిని భుజించటానికి కాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: