ETV Bharat / city

పెంచిన తల్లి ప్రశ్నలు... 'ఫేస్​బుక్' భవానీ కేసులో మలుపు..! - విజయవాడలో తప్పిపోయిన భవానీ కేసు వార్తలు

ఫేస్​బుక్.. తల్లిదండ్రులకు దూరమైన అమ్మాయిని వారితో కలిపింది. అమ్మానాన్నలను కలుస్తున్నానన్న ఆ అమ్మాయి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే.. పెంచిన తల్లి అనుమానాలతో ఇప్పుడా సంతోషం ఆలస్యమయ్యేలా ఉంది. ఈ ఉపోద్ఘాతమంతా విజయవాడకు చెందిన భవానీ గురించే.

vijayawada missing girl case
ఫేస్ బుక్ భవానీ
author img

By

Published : Dec 8, 2019, 5:10 PM IST

ఫేస్​బుక్ ద్వారా తల్లిదండ్రుల చెంతకు చేరబోయే భవానీ కేసు మలుపు తిరిగింది. మూడేళ్ల వయసులో హైదరాబాద్​​లో తప్పిపోయిన భవానీ.. విజయవాడకు చెందిన జయమ్మకు దొరికింది. శనివారం ఫేస్​బుక్ వీడియోకాల్ ద్వారా తన కుటుంబీకులను గుర్తుపట్టింది. అయితే.. ఇప్పుడు భవానీ కోసం వచ్చినవారు నిజమైన తల్లిదండ్రులని గ్యారెంటీ ఏంటని... పెంచిన తల్లి జయమ్మ ప్రశ్నిస్తోంది. సరైన ఆధారాలతో పాటు.. డీఎన్​ఏ పరీక్షలు చేసి.. అవి సరిపోలితేనే వారికి అప్పగిస్తానని జయమ్మ స్పష్టం చేసింది.

ఇప్పుడీ వ్యవహారం పోలీస్ స్టేషన్​కు చేరింది. పోలీసులు కన్న తల్లిదండ్రులను పటమట స్టేషన్​కు పిలిపించి మాట్లాడారు. కన్న తల్లిదండ్రులు, పెంచిన వారూ భవానీ తమకే కావాలని అంటున్నారు. ఇద్దరి దగ్గర చెరో కొన్ని రోజులు ఉంటానని భవానీ అంటోంది. ముందుగా పెంచిన తల్లిదండ్రుల వద్దకు వెళ్లనుంది. ఆ తర్వాత కన్నవారి వద్దకు పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు.

ఫేస్​బుక్ భవానీ ఎవరి దగ్గరికి వెళ్లనుంది..?

ఇవీ చదవండి..

ఫేస్​బుక్​ కలిపింది ఆ కుటుంబాన్ని..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.