ఇంద్రకీలాద్రిపై ఘనంగా వసంత పంచమి వేడుకలు - ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకల న్యూస్
వసంత పంచమి వేడుకలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయానికి వస్తున్న భక్తులు, విద్యార్ధులకు ఆలయ అధికారులు పెన్నులు, ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.