ETV Bharat / city

'చికిత్స' అనంతరం.. ఇకపై నెలకు రూ.5 వేలు ఆర్థికసాయం - the YSR Health Scheme has decided to provide post-treatment financial assistance

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అనంతరం అందించే ఆర్థిక సాయాన్ని.. నెలకు 5 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

YSR Health Scheme
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ
author img

By

Published : Nov 29, 2019, 2:03 PM IST

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం... దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారికి చెల్లించే ఆర్ధిక సాయంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రోజుకు 225 రూపాయల చొప్పున... నెలకు గరిష్టంగా 5 వేల చెల్లింపు చేసేందుకు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి చికిత్స అనంతరం అందించే ఆర్ధిక సాయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. మొత్తం 26 విభాగాల్లో 836 శస్త్రచికిత్సలకు ఈ ఆర్ధిక సాయాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారు. నెలలో గరిష్టంగా 5 వేల రూపాయల చెల్లిస్తామని.. రోజుకు 225 రూపాయల చొప్పున 22 రోజులకు ఈ ఆర్ధిక సాయం అందుతుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల్లో పేర్కోన్నారు. సాయం పొందేందుకు చికిత్స చేయించుకున్న రోగులు బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలని సూచించారు. ఏడాదిలో ఒక్కసారికే ఈ ఆర్ధిక సాయం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.

ఇవీ చదవండి

విద్య, వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.