ETV Bharat / city

రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏర్పాటుకు ఉత్తర్వులు - సీపీడీసీఎల్ వార్తలు

రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ పంపిణీ సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతూ మూడో డిస్కం ఏర్పాటైంది.

g.o. issued for cpdcl in vijayawada
ప్రతీకాత్మక చిత్రం
author img

By

Published : Dec 5, 2019, 8:26 PM IST

విజయవాడ కేంద్రంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(సీపీడీసీఎల్)​ను ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్ పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు...ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ(ఎస్పీడీసీఎల్) పరిధిలో నెల్లూరు, రాయలసీమ జిల్లాలు ఉండనున్నాయి. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు సంబంధించి విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్ర విభజనకు ముందు సెంట్రల్‌ డిస్కం పరిధిలో అనంతపురం, కర్నూలు జిల్లాలుండేవి. విభజన తర్వాత ఈ రెండు జిల్లాలను దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) పరిధిలో కలిపారు. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్‌ అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు సేవలందించాల్సి వస్తోంది. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలో 4 జిల్లాలే ఉన్నాయి. రాజధాని పరిధి క్రమేణా అభివృద్ధి చెందుతున్నందునా... పాలనా సౌలభ్యానికి సెంట్రల్‌ డిస్కంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.