డెంగీ నివారణకు తెరాస ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులకు సమస్యలు వస్తే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదని తేల్చిచెప్పింది. ఐఏఎస్‌లు కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్లు లేదని మండిపడింది. పత్రికల్లో డెంగీ జ్వరంపై అన్ని కథనాలొస్తున్నా పట్టించుకోవడం లేదని, వినోదాత్మక కథనాలు మాత్రమే చదువుతున్నారా అని నిలదీసింది. ఐఏఎస్‌లు దేశ పౌరులు కాదని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఎంతో ఖర్చు చేసి.. ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దుతోంది ఈ తరహా పనికేనా అని మండిపడింది. నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారుల జేబుల నుంచి బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై తీసుకున్న చర్యలను ప్రతి గురువారం కోర్టుకు వివరించాలని ఆదేశించింది.
పత్రికల్లో వినోదాత్మక కథనాలే చదువుతున్నారా? - ఐఏఎస్‌లపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
ఐఏఎస్‌లు కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్లు లేదని తెలంగాణ హైకోర్టు మండిపడింది. పత్రికల్లో ప్రతి పేజీలోనూ డెంగీ జ్వరంపై సమస్యలు వస్తున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వినోదాత్మక కథనాలు మాత్రమే చదువుతున్నారా అని ప్రశ్నించింది.
డెంగీ నివారణకు తెరాస ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులకు సమస్యలు వస్తే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదని తేల్చిచెప్పింది. ఐఏఎస్‌లు కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్లు లేదని మండిపడింది. పత్రికల్లో డెంగీ జ్వరంపై అన్ని కథనాలొస్తున్నా పట్టించుకోవడం లేదని, వినోదాత్మక కథనాలు మాత్రమే చదువుతున్నారా అని నిలదీసింది. ఐఏఎస్‌లు దేశ పౌరులు కాదని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఎంతో ఖర్చు చేసి.. ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దుతోంది ఈ తరహా పనికేనా అని మండిపడింది. నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారుల జేబుల నుంచి బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై తీసుకున్న చర్యలను ప్రతి గురువారం కోర్టుకు వివరించాలని ఆదేశించింది.
TAGGED:
telangana high court