ETV Bharat / city

'ఎస్సీ, ఎస్టీ కేసులు వంద శాతం నిజాలే' - విజయవాడలో నిర్వహించిన జాతీయ కన్వెన్షన్​లో ఎన్​హెచ్​ఆర్​సీ మాజీ ఛైర్మన్  జస్టిస్ కె.జి. బాలకృష్ణన్

ఎస్సీ, ఎస్టీ పీఓఎస్​ చట్టం​పై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నిర్వహించిన జాతీయ కన్వెన్షన్​లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్  జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ పాల్గొన్నారు.

'ఎస్సీ, ఎస్టీ కేసులు వంద శాతం నిజాలే'
author img

By

Published : Nov 4, 2019, 6:40 AM IST

Updated : Nov 4, 2019, 7:21 AM IST

ఎస్సీ ఎస్టీలకు చెందిన చట్టాలు కచ్చితంగా అమలు అయ్యేందుకు ఆ వర్గాల వారంతా కలసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి , జాతీయ మానవ హక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనా.. మరో అక్రమ కేసును బాధితులపై బనాయిస్తూ నీరు గారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​లోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. ఈ పరిస్ధితిలో పూర్తిగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నమోదయ్యే ఎస్సీ, ఎస్టీ కేసులన్నీ నిజమైనవని తాను భావిస్తున్నాన్నట్లు చెప్పారు. అత్యాచారానికి గురైనవారు బలహీనులని, వారిని కేసులు పెట్టకుండా నిందితులు భయపెడతున్నారని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీల పీఓఎస్​ యాక్ట్​పై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నిర్వహించిన జాతీయ కన్వెన్షన్​లో పాల్గొన్నారు. ఎస్సీలపై అట్రాసిటీ కేసుల నమోదులో పోలీసులు తాత్సారం చేస్తున్నారని అన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. మంచి సమాజం రూపొందించేందుకు విద్య ఎంతగానో దోహదపడుతుందన్న జస్టిస్ కె.జి.బాలకృష్ణన్.. పిల్లలను ఉన్నత చదువులు చదివించడం ద్వారానే ఎస్సీ, ఎస్టీల్లో అభ్యున్నతి వస్తుందని.. ఆ దిశగా ముందుకు వెళ్లాలని కోరారు.

ఇదీ చదవండి :

పోలీసు అధికారులకు న్యాయ విజ్ఞాన సదస్సు

sample description
Last Updated : Nov 4, 2019, 7:21 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.