రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆయన ఎంబీ భవన్లో నిర్వహించిన యురేనియం బాధితుల సభలో పాల్గొన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లి సమీప గ్రామాల్లో ఇటీవల పర్యటించిన అధ్యయన బృందం బాధితుల కష్టాలపై తీసిన వీడియోలను వీక్షించిన జస్టిస్ గోపాలగౌడ... జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మానవాళి మనుగడకే ప్రమాదం
యురేనియం తవ్వకాల వల్ల మానవాళి మనుగడే ప్రమాదకరంగా మారిందని జస్టిస్ గోపాలగౌడ్ అన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లిలోని యురేనియం పరిశ్రమ వల్ల ప్రజలు భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని... నిబంధనలు పాటించని సదరు సంస్థపై సీఎం జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యురేనియం బాధితులను హైదరాబాద్ తరలించి సత్వరం మెరుగైన చికిత్స అందించాలని... లేకుంటే తామంతా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన రాజ్యాంగ విరుద్ధమని.. సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
ఇదీ చదవండి :