విజయవాడ సమీపంలో ఉన్న నిడమనూరులోని కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చిస్ సంస్థకు చెందిన విద్యార్థులకు పాఠశాలే లేకుండా పోయింది. 10 రోజుల నుంచి ఆరుబయటే చదువుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం పాఠశాల కొనసాగుతున్న స్థలంలో చర్చి నిర్మించారు. ఎనిమిదేళ్లుగా స్థానిక కమ్యూనిటీ హాలులో పాఠశాల నడిపారు. ఈ మధ్య కమ్యూనిటీ హాలును రంగులు వేసి వార్డు సచివాలయంగా మార్చేశారు.
ఎయిడెడ్ పాఠశాలని బయట ఎక్కడైనా పెట్టుకోవాలని కమ్యూనిటీహాల్కి తాళం వేశారు. ఆ ప్రాంతంలో వెరొక స్థలం దొరక్క విద్యార్థులు కమ్యూనీటిహాలు ఆరు బయటే... విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులు పడుతున్న అవస్థలు చూసిన స్థానికులు ఒక షామీయానా వేయించారు. 10 రోజులుగా ఎండలో విద్యార్థులు పాట్లు పడుతున్నా... విద్యాశాఖ అధికారులు స్పందించకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.