ETV Bharat / city

సాక్ష్యాధారాలతో హైకోర్టు ముందుకు రవిప్రకాశ్​ కేసు

వరుసగా మూడు రోజులపాటు సాగిన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్​ విచారణలో సేకరించిన సాక్ష్యాధారాలను పోలీసులు హైకోర్టు ఎదుట రేపు ప్రవేశపెట్టనున్నారు. నిర్దోషిగా నిరూపించుకునేందుకు రవిప్రకాశ్​ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఇక కోర్టు తీర్పును బట్టి అరెస్టు చేయాలా వద్దా అనేది తేలనుంది.

రవిప్రకాశ్ కేసు
author img

By

Published : Jun 10, 2019, 12:47 AM IST

Updated : Jun 10, 2019, 11:26 AM IST

సాక్ష్యాధారాలతో హైకోర్టు ముందుకు రవిప్రకాశ్​ కేసు

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణ అనంతరం పోలీసులు తమ వద్ద ఉన్న పూర్తి సాక్ష్యాధారాలను రేపు న్యాయస్థానం ఎదుట ఉంచనున్నారు.​ ధర్మాసనం ఇచ్చే ఉత్తర్వులను బట్టి రవిప్రకాశ్​ను అరెస్టు చేయాలా వద్దా అనేది తెలుస్తుందని సైబర్ ​క్రైం ఏసీపీ శ్రీనివాస్​ కుమార్​ వెల్లడించారు. నిర్దోషిగా నిరూపించుకునేందుకు రవిప్రకాశ్ తగిన ఆధారాలు చూపలేదని స్పష్టం చేశారు. ఫోర్జరీ చేసినట్లు వస్తున్న అభియోగాలపై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఏసీపీ వివరించారు. సుప్రీం కోర్టు సూచనల మేరకే విచారణ చేస్తామన్న ఏసీపీ... 3 రోజులపాటు ప్రశ్నించినప్పటికీ రవిప్రకాశ్​ పొంతన లేని సమాధానం చెప్పారన్నారు. నటుడు శివాజీ మాత్రం ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదని ఏసీపీ తెలిపారు.

ఇవీ చూడండి: ప్రేమ... పెళ్లి... ఫిర్యాదు... అసలేమైంది?

sample description
Last Updated : Jun 10, 2019, 11:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.