జైలు ఎంట్రన్స్‌లాగే ఇక్కడా ఉంటుంది. లోపలికి వెళ్లగానే కటకటాలతో కొన్ని గదులు కనిపిస్తాయి. పోలీసుల్లా కనిపించే వాళ్లు వచ్చి ఆ గదిలోకి మనల్ని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు. తర్వాత మనం చెప్పిన మెనూ నోట్ చేసుకుంటారు. ఇక ఖైదీ డ్రెస్సులో ఉండే సర్వర్లు మనకు వడ్డిస్తారు. మొత్తంగా ఖైదీ కిచెన్‌గా పిలిచే ఈ తరహా రెస్టారెంట్‌కి వెళితే... అచ్చం జైల్లో అన్నం తిన్న అనుభూతి కలుగుతుంది. ఈ థీమ్ రెస్టారెంట్లు హైదరాబాద్‌తో సహా చెన్నై, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్నాయి.
ఈ జైల్లో ఎవరైనా తినొచ్చు..!
నీతో చిప్ప కూడు తినిపిస్తారా...’ అని సినిమాలో హీరో విలన్‌తో అనడం చూస్తుంటాం. కానీ అదే జైల్లో అన్నం తినేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఎందుకంటే అదో జైల్‌థీమ్డ్ రెస్టారెంట్.