పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పీఏసీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్స్ కమిటీల నియామకాలకు సభాపతి షెడ్యూల్ ప్రకటించడంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్యాబినెట్ హోదాతో సమానమైన ఈ పదవి ప్రతిపక్షానికే దక్కనుండటంతో తెలుగుదేశం నుంచి పలువురు ఆశావాహులు పోటీపడ్డారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చిన్నరాజప్ప, సీనియర్ నేత కరణం బలరాం, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, గణబాబు వంటివారు రేస్‌లో ఉన్నా చివరకు పయ్యవుల కేశవ్‌ను ఆ పదవికి ఎంపికచేశారు. ఇవాళ నేతలందరితో చర్చించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి