ETV Bharat / city

న్యాయవాదుల ధర్నాకు అనుమతి నిరారకణ - విజయవాడలో న్యాయవాదుల ర్యాలీ

రేపు విజయవాడ ప్రకాశం బ్యారేజిపై జిల్లాల యునైటెడ్ అడ్వకేట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు తలపెట్టిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిత్యం ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగించే రహదారి కావడం వలన ధర్నాకు అనుమతి ఇవ్వలేమన్నారు. ధర్నా చౌక్ వద్ద నిరసనలు తెలపాలని న్యాయవాదులకు సూచించారు. అనుమతి లేకుండా ధర్నా, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

No permission for lawyers rally in vijayawada
న్యాయవాదుల ధర్నాకు అనుమతి నిరారకణ
author img

By

Published : Dec 25, 2019, 9:46 PM IST

రేపు ప్రకాశం బ్యారేజిపై న్యాయవాదులు చేపట్టే ధర్నా కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీసులు స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు తరలింపునకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల యునైటెడ్ అడ్వకేట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27 తేదీ వరకు పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. వీటిలో భాగంగా రైతులు, రాజకీయనేతలతో కలిసి రేపు.. ప్రకాశం బ్యారేజిపై ధర్నా కార్యక్రమం నిర్వహించాలని న్యాయవాదులు నిర్ణయించారు. ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ప్రకాశం బ్యారేజిపై ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని... ధర్నా వలన ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులకు గురవుతారని పోలీసులు తెలిపారు. ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలపాలని న్యాయవాదులకు సూచించారు. అనుమతి లేకుండా ధర్నా చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి :

రాజధాని తరలిస్తే ఉద్యమమే: అమరావతి పరిరక్షణ సమితి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.