అప్పగింతలు.. ఓన్లీ..పెళ్లిళ్లలోనేనా.. ఎవరైనా.. ఎవరికైనా ఇవ్వొచ్చు. అదే అంటోంది 2019. కొన్ని విషయాలను 2020కి గుర్తుచేస్తుంది. జాగ్రత్తా! అంటూ హెచ్చరిస్తోంది. ప్రజలను ఎలాంటి.. ఇబ్బందులు పెట్టొదని చెబుతుంది.
2020: ఇంతకీ నీ 2019లో ఏం జరిగింది.
2019: నాలోనే మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది తెలుసా.
2020: మూడు రాజధానులా?
2019: అవును! రాజధాని రైతులు ఒకటే నిరసనలు, ఆందోళనలు. ఈ వ్యవహరంపై కాస్త జాగ్రత్తగా ఉండు. వీలైతే నీలోనే ఈ సమస్య పరిష్కారమయ్యేలే చేయి.
2020: ఏమో.. రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో?
2020: ఎన్ఆర్సీ అని కూడా విన్నాను.
2019: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్ఆర్సీ నిర్ణయంపై రచ్చ జరిగింది.
2020: మరి ప్రభుత్వం ఏమంది?
2019: తర్వాత వెనక్కు తగ్గినట్టే అనిపించింది. నీలో ఇలాంటి సమస్యలు లేకుండా.. ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు.
2020: అవునా.. ఇంకా!
2019: నాలోనే సార్వత్రిక సమరం జరిగింది. మరీ ఎక్కువ కాదు గానీ.. కొన్ని సమస్యలైతే వచ్చాయి. నన్ను తిట్టుకున్న వారూ ఉన్నారు. నాకు తెలిసి పంచాయతీ పోల్ నీలోనే జరుగుతుందేమో.
2020: అవునా?
2019: పంచాయతీ ఎన్నికలు నాలోనే జరగాల్సింది. అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. సార్వత్రిక సమరంలో మద్యం ఏరులై పారింది. పంచాయతీ పోల్‌లో జోరెక్కువా. నువ్ ఎంత జాగ్రత్త పడితే అంత మంచింది.
2020: వామ్మో.. తాగితే.. లేనిపోని గొడవలు.. మద్యం బాబుల గడ్డం పట్టుకోనైనా.. వద్దంటా.
2019: నాలో చాలా క్రైమ్ జరిగింది. దేశాన్ని మెుత్తం ఒకే మాటపైకి తెచ్చిన 'దిశ' ఘటన జరగడం బాధకరం.
2020: దిశ ఘటనా.. ఏమైంది అసలు?
2019: పాపం ఓ అమ్మాయిని దుర్మర్గులు దారుణంగా హత్యచారం చేశారు. చివరకు సీన్ రికన్స్ట్రక్షన్లో ఎన్కౌంటర్ అయ్యారు.
2020: అంత దారుణాలు జరుగుతాయా?
2019: అంతకంటే దారుణాలు జరుగుతాయి. బయటకురాకుండా కాలగర్భంలో కలిసిన నేరాలెన్నో ఉన్నాయి. చూసుకో నీ 2020లో క్రైమ్ ఎక్కువ జరగకుండా.. జాగ్రత్తపడు.
2020: ఇంకా ఏమేమేం జరిగాయో..నీలో?
2019: పాపం అనావృష్టితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. వేల ఎకరాల పంట నష్టం.
2020: ప్రాజెక్టులు నిండాయా మరి?
2019: ప్రాజెక్టులు నిండిపోయేలా.. వర్షాలు పడ్డాయి. అతివృష్టి ఎక్కువై.. నాలోనే ఉల్లి లొల్లి జరిగింది.
2020: వర్షాలు ఎక్కువ కురిసినా సమస్యే కదా!
2019: అవునూ నీ హయంలో ప్రాజెక్టులు నిండేలా చూడు. కానీ అతివృష్టి రానివ్వకు. అన్నదాతలు ఆవేదన చెందేలా అస్సలు చేయకు. జాగ్రత్త!
2020: సినిమా ప్రపంచం గురించి సంగతేంటీ?
2019: చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని మాత్రమే.. హిట్. కొన్నింటిలో కొన్ని మాత్రమే సూపర్ హిట్. విజయలేమంతా చెప్పుకునేలా లేవులే. నువ్వైనా.. టాలివుడ్‌కు విజయాలనెక్కువ ఇవ్వు.
2020: ఈసారి దర్శకులు మంచి కథలు ఎంచుకునేలా చేస్తా.
2019: అవునూ.. నిన్ను నువ్ గమించావా?
2020: ఎందుకు ఏమైంది?
2019: 01-01-20 అని ఏదైనా డాక్యుమెంట్స్‌పై రాసినా సమస్యే.. తెలివైన వారేవరైనా.. సంవత్సరం పక్కనే రెండు అంకెలు కలిపి.. గతంలోకి తీసుకెళ్లొచ్చు. ఎక్కువ తెలివైన వాళ్లైతే.. భవిష్యత్‌లోకి తీసుకెళ్లగలరు సుమీ! వీలైతే.. మెుత్తం 01-01-2020 అని రాసేలా.. జనాలకు గుర్తుచేయి.
2020: అవునవునూ..మర్చిపోయా. ఏదైనా జరిగితే.. నన్నే తిట్టుకుంటారు. గుర్తుపెట్టుకుంటా.
నీలో దు:ఖాలు..సంతోషాలు.. బాధలు.. బాధ్యతలు.. ఆప్యాయతలు.. అన్యాయాలు.. ఆవేదనలు.. ఇలా అన్ని ఉంటాయి. మనిషికి కావాల్సినవి ఇవ్వు. వాళ్లు వద్దనుకున్నవి.. నీలోనే కలిపేసుకో.. వాళ్లు సంతోషంగా ఉంటే ఇంకేం కావాలి.
ఇదీ చదవండి: ప్రోమో: సాంగ్ ఆఫ్ ద ఇయర్ 'సామజవరగమన'