రాష్ట్ర ప్రభుత్వంపై మతపరమైన ఆరోపణలు చేస్తున్నారని... మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్పై మతపరమైన ప్రచారం చేసి... భాజపాకు మళ్లీ దగ్గర అవుదామని తెదేపా చూస్తోందని వెల్లంపల్లి ఆరోపించారు. తిరుమలలోని కొండపై సౌరఫలకాన్ని చూసి శిలువగా ప్రచారం చేస్తున్నారని... భవానీ ద్వీపంలో చేపట్టిన నిర్మాణం గత ప్రభుత్వ హయాంలోనిదేనని మంత్రి వివరించారు.
ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ మతరమైన అంశాలను అడ్డుపెట్టుకొని... రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక దీక్షకు తెదేపాకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారన్న మంత్రి... తిరుమల వెంకటేశ్వర స్వామి తమ కులానికి చెందినట్టుగా తెదేపా నేత మురళీమోహన్ వ్యాఖ్యానించారని... విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.
ఇదీ చదవండి:బండెనక బండి... ఇసుక కోసమేనండి...